PGCIL Recruitment 2023 :న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. తమ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్యాలయాల్లో గేట్-2024 ద్వారా ఇంజినీర్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగ వివరాలు..
- ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్)
- విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్.
ఖాళీలు..
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు వెల్లడి
- పీజీసీఐఎల్ రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్- ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిశా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.
జీత భత్యాలు..
- ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.40,000 స్టైపెండ్ అందుతుంది.
- శిక్షణ అనంతరం ఇంజినీర్ ఈ-2 హోదాలో నియమితులవుతారు.
- నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం అందుతుంది.
విద్యార్హత..
PGCIL Recruitment 2023 Age Limit : కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయస్సు..
PGCIL Recruitment 2023 Age Limit :2023 డిసెంబర్ 12 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.