PGCIL Trade Apprentice Jobs : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1045 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Engineer jobs in India : ప్రభుత్వ రంగ సంస్థ హరియాణా గుడ్‌గావ్‌లోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
పీజీసీఐఎల్ రీజియన్స్ వారీగా పోస్టుల వివరాలు
- కార్పొరేట్ సెంటర్ (గుడ్‌గావ్) - 53
- నార్తెర్న్ రీజియన్ 1 (ఫరీదాబాద్) - 135
- నార్తెర్న్ రీజియన్ 2 (జమ్ము) - 79
- నార్తెర్న్ రీజియన్ 3 (లఖ్‌నవూ) - 93
- ఈస్ట్రన్ రీజియన్ 1 (పట్నా) - 70
- ఈస్ట్రన్ రీజియన్ 2 (కోల్‌కతా) - 67
- నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్) - 115
- ఒడిశా ప్రాజెక్ట్స్ (భువనేశ్వర్) - 47
- వెస్ట్రన్ రీజియన్ 1 (నాగ్‌పుర్) - 105
- వెస్ట్రన్ రీజియన్ 2 (వడోదర) - 106
- సదరన్ రీజియన్ 1 (హైదరాబాద్) - 70
- సదరన్ రీజియన్ 2 (బెంగళూరు) - 105
అప్రెంటీస్‌షిప్ ట్రేడ్ విభాగాలు
PGCIL Engineering Jobs : గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ - ఎలక్ట్రీషియన్, డిప్లొమా (ఎలక్ట్రీషియన్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్
విద్యార్హతలు ఏమిటి?
ఆయా విభాగాలను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ క్యాలిఫై అయ్యుండాలి.