PGCIL Diploma Jobs :ఇంజినీరింగ్, డిప్లొమాలు చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) 425 డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
PGCIL Diploma Trainee Category :
- డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) - 344
- డిప్లొమా ట్రైనీ (సివిల్) - 68
- డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 13
విద్యార్హతలు
PGCIL Diploma Trainee Qualification : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఇంజినీరింగ్, డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి
PGCIL Diploma Age Limit :అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలు మించి ఉండకూడదు.
అప్లికేషన్ ఫీజు
PGCIL Diploma Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
PGCIL Diploma Selection Process :అభ్యర్థులను CBT పద్ధతిలో ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
PGCIL Diploma Trainee Salary : డిప్లొమా ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వరకు జీతం అందిస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
PGCIL Diploma Trainee Online Application Process :ఆసక్తిగల అభ్యర్థులు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://www.powergrid.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తుకు మందు అభ్యర్థులు తమ సర్టిఫికేట్స్ స్కాన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
- అభ్యర్థులు కచ్చితంగా ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను కలిగి ఉండాలి. ఎందుకంటే.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సహా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మీ ఈ-మెయిల్, మొబైల్ నంబర్లకే పంపిస్తుంది.
- అభ్యర్థులు ముందుగా https://www.powergrid.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు సహా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు నమోదు చేయాలి.
- తరువాత మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించాలి.
- చివరిగా దరఖాస్తులోని వివరాలు మరోసారి సరిచూసుకొని, సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్‌లో రిఫరెన్స్ కోసం అప్లికేషన్‌ను ప్రింట్అవుట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
PGCIL Diploma Trainee Application Dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 1
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 23
ఆసక్తిగల అభ్యర్థులు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://www.powergrid.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.