తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pfizer:త్వరలో ఫైజర్​ టీకాకు భారత్​ అనుమతి!

అమెరికాకు చెందిన ఫైజర్ కొవిడ్​ టీకాలు త్వరలోనే భారత్​కు రానున్నాయి. ఈమేరకు ప్రభుత్వంతో ఒప్పందం తుది దశలో ఉన్నట్టు ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా తెలిపారు.

pfizer vaccine
ఫైజర్ టీకా, కొవిడ్ వ్యాక్సిన్

By

Published : Jun 22, 2021, 6:53 PM IST

Updated : Jun 22, 2021, 7:50 PM IST

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. విదేశీ టీకాలను దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫైజర్​ టీకాలు త్వరలోనే భారత్​కు రానున్నట్లు సమాచారం.

ఫైజర్ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా.. ఈ విషయంపై స్పందించారు. భారత ప్రభుత్వంతో ఒప్పందం తుది దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. బయో ఫార్మాహెల్త్​కేర్ 15వ సదస్సులో మాట్లాడిన ఆయన.. త్వరలో ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ టీకాను జర్మన్​ సంస్థ బయోఎన్​టెక్, ఫైజర్​ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కొవిడ్​ను అరికట్టడంలో ఈ టీకా సామర్థ్యం 90 శాతం ఉండటం గమనార్హం.

మోడెర్నా, ఫైజర్​..

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్.. మోడెర్నా, ఫైజర్​ టీకాలను భారత్​లో అనుమతించనున్నట్లు ఇటీవలే తెలిపారు.

డీసీజీఐ..

భారత్‌లో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే వెల్లడించింది. ఇప్పటికే పలు విదేశీ నియంత్రణ సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన టీకాలు దేశంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసేలా నిర్దిష్ట మినహాయింపులు ఇచ్చింది డీసీజీఐ. ఈ టీకాలు భారత్‌లో అనుమతుల కోసం బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదని డీసీజీఐ చీఫ్‌ వి.జి.సొమని తెలిపారు.

ఇదీ చదవండి:భారత్​కు 'ఫైజర్' ఎప్పుడొస్తుందని సీఈఓకు మెయిల్​

Last Updated : Jun 22, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details