Petrol Bomb at BJP Office: తమిళనాడులో భాజపా ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణ జరపాలని డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ. నేరస్థున్ని తప్పకుండా శిక్షించాలని రాష్ట్ర భాజపా చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపించారు.
'భాజపా ఆఫీస్‌పై పెట్రోల్ బాంబు దాడి కేసులో భారీ కుట్ర' - tamilnadu Petrol Bomb attack
Petrol Bomb at BJP Office: తమిళనాడులో భాజపా ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణ జరపాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ కేసులో భారీ కుట్ర దాగి ఉందని రాష్ట్ర భాజపా చీఫ్ అన్నామలై అనుమానం వ్యక్తం చేశారు.
బాంబు దాడి
ఈ కేసులో భారీ కుట్ర దాగి ఉందని అన్నామలై అన్నారు. ఎన్ఐఏ దర్యాప్తుతో మాత్రమే సరైన న్యాయం దక్కుతుందని చెప్పారు. ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వ పాత్రను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:భారత జలాల్లోకి పాక్ బోట్లు.. సీజ్ చేసిన బీఎస్ఎఫ్