తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవార్ ఇంటిపై దాడి కేసు.. గాడిద వీడియో వైరల్​ - శరద్ పవార్​ ఇంటిపై దాడి కేసు

Pet Donkey Video: ముంబయిలో ఓ గాడిద వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శరద్​పవార్ ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన సదావర్తే కుటుంబం దీన్ని పెంచుకోవడమే ఇందుకు కారణం. ఈ డాంకీని వీరు శునకం లాంటి పెంపుడు జంతువులా ట్రీట్ చేస్తున్నారు.

Pet donkey arrested in sharad pawar house attack case
పవార్ ఇంటిపై దాడి కేసులో గాడిద అరెస్ట్​.. వీడియో వైరల్​

By

Published : Apr 19, 2022, 10:41 AM IST

Updated : Apr 19, 2022, 11:18 AM IST

పవార్ ఇంటిపై దాడి కేసు.. గాడిద వీడియో వైరల్​

Pet Doneky: ఎన్సీపీ అధినేత శరద్​పవార్ ఇంటిపై కొద్దిరోజుల క్రితం దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అడ్వకేట్​ గుణరత్న సదావర్తేను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన చాలా స్టోరీలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. సదావర్తే కుటుంబం పెంచుకునే ఓ గాడిద వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీరు గారాబంగా పెంచుకునే ఈ డాంకీ పేరు మ్యాక్స్ అట. దాని ఫొటోలు, వీడియోలను సదావర్తేనీ భార్య జయశ్రీ పాటిల్ ఫేస్​బుక్​లో షేర్ చేశారు. తనతో పాటు కూతురు కూడా గాడిదతో ఆప్యాయంగా గడపడం, దానికి ఆహారం తినిపించడం వంటి దృశ్యాలు కాసేపట్లోనే వైరల్​గా మారాయి. శునకాలు, పిల్లులు పెంచుకోవడం మామూలే కానీ గాడిదలను కూడా పెంపుడు జంతువుల్లా ట్రీట్​ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీంతో ఈ డాంకీ వార్తల్లో నిలిచింది.

పవార్ ఇంటిపై దాడి కేసులో గాడిద అరెస్ట్​.. వీడియో వైరల్​
పవార్ ఇంటిపై దాడి కేసు.. గాడిద వీడియో వైరల్​

Sharad Pawar House Attack: శరద్​పవార్ ఇంటిపై దాడికి కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదావర్తే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. సతారా పోలీస్​ స్టేషన్​లో అతనిపై కేసు నమోదైంది. దీనితో ఇతర స్టేషన్లలోనూ ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిని ఎదుర్కొని ఆయన ఎప్పుడు భయటకు వస్తారో చూడాలి. ఆయన కుటుంబసభ్యులు కూడా ఈ కేసుల నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు.

సదావర్తే కుటుంబం

మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కొంత మంది ఉద్యోగులు ముంబయిలోని శరద్‌ పవార్‌ ఇంటివద్దకు ఏప్రిల్​ 8న ఆందోళన చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఆయన ఇంటిపై మరికొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఎంఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ఆదుకోవాలంటూ గతేడాది నవంబర్‌ నుంచే వేల మంది ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. దాదాపు 100 మంది ఉద్యోగులు పవార్​ ఇంటిముందు నిరసన తెలుపుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సదావర్తే సహా పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:అక్కడ.. పిల్లలు పుట్టాకే పెళ్లి చేసుకుంటారట!

Last Updated : Apr 19, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details