కేరళలో అమానవీయ ఘటన జరిగింది. మూగజీవి అనే కాస్తైనా కనికరం లేకుండా.. తన పెంపుడు శునకంపై కర్కశంగా ప్రవర్తించాడో వ్యక్తి. కుక్క మెడకు తాడు కట్టి తన కారుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని తన చరవాణిలో బంధించగా.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే.?
ఎర్నాకుళం జిల్లా పారావుర్కు చెందిన యూసుఫ్.. తన పెంపుడు శునకాన్ని తాడుతో కారుకు కట్టి విచక్షణా రహితంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి.. పోలీసులకు సమాచారమిచ్చాడు. అనంతరం యూసుఫ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గాయపడిన శునకాన్ని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.