Supreme Court: ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తులు.. ఓ క్రిమినల్ కేసులోని ఇతర నిందితులపై కొనసాగతున్న విచారణ ప్రక్రియ (ప్రొసీడింగ్స్)ను కొట్టివేయాలని కోరజాలరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టోషన్లో గతంలో నమోదైన యూపీపీసీఎల్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాల్సిందిగా కోరుతూ దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా.. జస్టిస్ ఏ.ఎం ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది.
'ఎఫ్ఐఆర్లో పేరు లేనివారు.. కేసు కొట్టివేయాలని కోరలేరు' - fir
Supreme Court: ఓ క్రిమినల్ కేసులోని ఇతర నిందితులపై కొనసాగతున్న విచారణ ప్రక్రియను కొట్టివేయాలని ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తులు కోరలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది.
supreme-court
ఉత్తర్‌ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌గా పిలిచే ఈ కేసులను తొలుత రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయగా, అనంతరం సీబీఐకి బదిలీ చేశారు. "ఈ కేసులోని నిందితుల పేర్లలో పిటిషనర్లు లేరు. అలాంటప్పుడు వారు ఎఫ్ఐఆర్ లేదా కేసును కొట్టివేయాలని కోరలేరు." అని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చూడండి:'అత్యధిక బ్యాంకు మోసాలు మోదీ హయాంలోనే '