తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు... - చెప్పులు ఎత్తుకెళ్లారని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు

Person Complaints Stolen Slippers: దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు సంబంధించి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తుంటారు బాధితులు. ఇదే విధంగా.. రూ. 180 విలువ చేసే చెప్పులు పోయాయని ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చాడు. అయితే అసలైన ట్విస్ట్​ ఇక్కడే ఉంది.

Person lodges plaint about his stolen slippers, fears 'implication in crime'
Person lodges plaint about his stolen slippers, fears 'implication in crime'

By

Published : May 8, 2022, 1:15 PM IST

Person Complaints Stolen Slippers: నిత్యం తీరిక లేకుండా ఉండే పోలీసులకు.. అప్పుడప్పుడు విచిత్రమైన కేసులు వస్తుంటాయి. మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​ జిల్లా ఖాచ్రోడ్​ పోలీస్​ స్టేషన్​లో ఇలాంటి ఓ కేసు నమోదైంది. రూ. 180 విలువ చేసే తన చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు జితేంద్ర అనే వ్యక్తి. తొలుత ఇది విని కొందరు పోలీసులు నవ్వుకున్నారు. అతడు చెప్పింది విన్నాక షాకయ్యారు. చివరకు అతడి కంప్లైంట్​ను మాత్రం స్వీకరించారు.

ఇదీ జరిగింది:జితేంద్ర తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నాడు. 180 రూపాయల విలువైన నల్లటి రంగు చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. అయితే.. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ''ఒకవేళ దొంగలించిన చెప్పులను.. నిందితుడు వేరే నేరం చేసిన ప్రదేశంలో వదిలేస్తే.. నన్ను బాధ్యుడిని చేయొచ్చు. ఇదంతా చూస్తే.. ఎవరో నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందులో కుట్ర దాగుందేమో.'' అని వివరించాడు. అతడి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకొని.. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఏ తప్పూ జరగదని జితేంద్రకు భరోసా ఇచ్చి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details