కరోనా టీకాల పంపిణీలో ఎలాంటి కాల వ్యవధి లేదని ప్రభుత్వం తెలపటాన్ని సూచిస్తూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ క్రమంలో తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
వ్యాక్సిన్లు ఎక్కడ ఉన్నాయో వెల్లడించాలని, ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ట్వీట్ చేశారు రాహుల్.
"ప్రజల జీవితాలు లైన్లలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఎలాంటి టైమ్ లైన్ లేదని ఒప్పుకుంది. ప్రభుత్వానికి ధైర్యం లేదని స్పష్టమవుతోంది. "
- రాహుల్ గాంధీ.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో టీకా పంపిణీని పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్ట గడువు అంటూ ఏమీ నిర్ణయించలేదని లోక్‌సభకు ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజున ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. అయితే.. 18 ఏళ్లు, ఆపై వయసు వారికి 2021 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుతుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
'మోదీ ప్రభుత్వ అబద్ధాలు బయటపడ్డాయి..'
టీకా పంపిణీపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానంతోనే మోదీ ప్రభుత్వ అబద్ధాలు బయటపడ్డాయని విమర్శించారు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. వ్యాక్సినేషన్‌పై ఇన్నాళ్లు చెప్పినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు.
ఇదీ చూడండి:'పెగాసస్‌తో రాజద్రోహానికి పాల్పడ్డ ప్రభుత్వం'