కొవిడ్-19 మహమ్మారి కేవలం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్)తో బాధపడుతున్నట్లు బయటపడింది.
కొవిడ్ బారిన పడిన వారు ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవాలని, ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేవలం ఊపిరితిత్తులనే కాకుండా, పొట్టను సైతం దెబ్బతీస్తోందని.. అది గ్యాంగ్రీన్కు దారి తీస్తోందని తెలిపారు. గ్యాంగ్రీన్గా మారితే.. అలాంటి పేగులను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
15 శాతం కొవిడ్ బాధితుల్లో...
ఇలాంటి కేసు తొలిసారి బెంగళూరులో గత ఏడాది బయటపడింది. సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో ఓ రోగికి దెబ్బతిన్న చిన్న పేగులను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం కొవిడ్ రెండో దశలో అలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. సుమారు 10-15 శాతం మంది కొవిడ్ రోగుల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలో ఇప్పటికే 25కు పైగా కేసులు వచ్చాయి.