కరోనా వైరస్ సోకిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లతో భారత్ సంసిద్ధంగా ఉందని చెప్పారు. సీఐఐ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ సమావేశంలో కృష్ణ ఎల్ల మాట్లాడారు.వైరస్ సోకిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే విషయానికి వస్తే ఆయన ఔననే సమాధానం చెప్పారు. ఎందుకంటే వారిలో టీ కణాల ప్రతిస్పందన అవసరమైన మేరకు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అందుకే వైరస్ సోకిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
'వారు కూడా టీకా తప్పనిసరిగా తీసుకోవాలి' - coronavirus vaccine latest news
కరోనా బారిన పడిన ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా టీకా తీసుకోవాలన్నారు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల. ఇప్పటికే కొవిడ్ సంక్రమించిన వారిలో వ్యాధితో పోరాడే జీవకణాలు తగ్గిపోతే తిరిగి ఇబ్బందిపడాల్సి వస్తుందన్నారు.
'వారు కూడా టీకా తప్పనిసరిగా తీసుకోవాలి'
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ గురించి ప్రస్తావించిన ఆయన, దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో ప్రయోగాలు జరుపుతున్నామని కృష్ణ ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రయోగాల కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా.. రానున్న రోజుల్లోనూ కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేట్లు చూడాలని అభిప్రాయపడ్డారు.