కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. చాలా చోట్ల ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు అయితే ఈ వైరస్‌కు మత విశ్వాశాలతో ముడిపెడుతున్నారు. గుజరాత్‌లోని ఆహ్మదాబాద్ జిల్లాలో బుధవారం ఇటువంటి ఘటనే జరిగింది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా.. వందల సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు 46 మందిని అరెస్ట్ చేశారు.
ఆ గ్రామస్థుల విశ్వాసం..
ఈ మహమ్మారి ఒక శాపం అని.. స్థానికంగా ఉన్న బలియదేవ్ ఆలయంలో అభిషేకం నిర్వహిస్తే గానీ వైరస్ కట్టడి కాదని రాయ్‌పుర్ సహా చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ వందల సంఖ్యలో గ్రామస్థులు ఆలయానికి వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.