కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారాంతాల్లో జనతా కర్ఫ్యూను కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ ఆంక్షలను ప్రజలు విస్మరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు. హుబ్బళ్లీలోని ఏపీఎంసీ (అగ్రికల్చర్ ప్రోడ్యూస్ మర్కెట్ కమిటీ) మార్కెట్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ కూరగాయలు కొనేందుకు ప్రజలు శనివారం ఇలా భారీగా తరలివచ్చారు.
'జనతా కర్ఫ్యూ'ను కూడా లెక్క చేయని ప్రజలు - కర్ణాటక జనతా కర్ఫ్యూ
దేశంలో కరోనా విజృంభిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. నిబంధనలపై నిర్లక్ష్యం వహిస్తూ బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించకుండానే తిరుగుతున్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లీలో ఇటువంటి ఘటనే జరిగింది. అక్కడ జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా.. జనం భారీగా మార్కెట్కు మార్కెట్కు తరలివచ్చారు.
కర్ణాటకలో నిబంధనల ఉల్లంఘన
రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈనెల 10 నుంచి 24 వరకు రెండు వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :లాక్డౌన్ ఉన్నా.. ముంబయికి పోటెత్తున్న వలస కార్మికులు