ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ అసోంలోని మజులీ ద్వీప ప్రజలు శుక్రవారం వేడుక చేసుకున్నారు. బ్రహ్మపుత్ర నదిపై మజులి, జోర్హత్ మధ్య నిర్మించ తలపెట్టిన బ్రిడ్జికి శంకుస్థాపన చేసినందుకు దీపాలు వెలిగించి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ట్విట్టర్లో పంచుకున్నారు. 'థ్యాంక్యూ మోదీజీ (ధన్యవాదాలు మోదీజీ)' అనే ఆంగ్ల అక్షరాల్లో పేర్చిన దీపాలు ఆకట్టుకున్నాయి.
మోదీ కానుకకు మురిసిన ప్రజలు- మెరిసిన మజులి
అసోంలో మజులి వంతెనకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రజలు దీపకాంతులతో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ మజులితో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని చెప్పారు.
మోదీ కానుక.. మజులి పండుగ
"పవిత్రమైన మజులిలో కృతజ్ఞత, అభిమానం చూపుతూ దీపకాంతులతో వేడుకలు జరిగాయి. మజులి వంతెనతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరడమే కాక ప్రగతికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ధన్యవాదాలు మోదీజీ." అని సోనోవాల్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:'అసోం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'