తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ రెండు కూటములతో విసుగెత్తిన ప్రజలు' - Modi polls rally in Kerala

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌తో కేరళ ప్రజలు విసుగు చెందారని.. భాజపా నాయకత్వంలో అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. కేరళలోని పతనంథిట్టలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని.

People of Kerala fed up with LDF, UDF; want change and development agenda of BJP: PM Modi
విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తెచ్చేందుకే భాజపా ప్రయత్నం

By

Published : Apr 2, 2021, 3:42 PM IST

కేరళలోని అధికార ఎల్​డీఎఫ్​, ప్రతిపక్ష యూడీఎఫ్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌తో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారన్న మోదీ.. భాజపా నాయకత్వంలో అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేరళ పతనంథిట్ట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

"ఇప్పటివరకు జరిగింది చాలు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో యూడీఎఫ్​, ఎల్​డీఎఫ్​కు తగిన బుద్ధి చెప్పాలి. ప్రజలు.. భాజపా అభివృద్ధి అజెండాను చూస్తున్నారు."

- ప్రధాని నరేంద్ర మోదీ

విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకురావడానికి భాజపా ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'మెట్రోమ్యాన్​' శ్రీధరన్​ కేరళలో పోటీ చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కేరళతో పాటు దేశాభివృద్ధికి ఆయన ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. ఇప్పుడు సమాజానికి సేవ చేయడానికి భాజపాలో చేరారని తెలిపారు మోదీ.

ఇదీ జరిగింది:'తమిళ ప్రజలు విశాల హృదయులు'

ABOUT THE AUTHOR

...view details