బంగాల్ ఎన్నికల్లో ఇప్పటికే భాజపా సెంచరీ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు ఓట్ల రూపంలో.. తమకు ఫోర్లు, సిక్సులు ఇచ్చారని తెలిపారు. నందిగ్రామ్‌లో మమత క్లీన్ బౌల్డ్ అయ్యారని ఎద్దేవా చేశారు.
బంగాల్లోని బర్ధమాన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గ్రౌండ్ నుంచి నిష్క్రమించాలని బంగాల్ ప్రజలు.. మమతకు సూచించారని, బంగాల్లో లెఫ్ట్ కూటమికి పట్టిన గతే.. తృణమూల్ కాంగ్రెస్ పడుతుందని ఆరోపించారు.
'దీదీ నినాదానికి అదే అర్థం'
మమతకు సన్నిహితంగా ఉండే ఓ నేత.. ఎస్సీ వర్గాన్ని భిక్షమెత్తేవారుగా అభివర్ణించటంపై మోదీ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో అంబేడ్కర్‌ను అవమానించినట్లేనన్నారు. దళితులను అవమానించి.. మమత అతి పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మమత నినాదం.. మా, మాటీ, మనుష్ కు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు మోదీ. వేధించే దీదీ (మా), (మాటీ) బంగాల్‌ను దోచుకోవటం, ప్రజల్ని హింసించటం (మనుష్) గా అభివర్ణించారు.
ఇదీ చదవండి :'సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమే.. కానీ'