మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ప్రజల్ని పులులు హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి పులులు వచ్చి తమపై దాడి చేస్తాయోనన్న భయంతో అక్కడి కొన్ని గ్రామాల ప్రజలు వణుకుతున్నారు. నిన్న ఒక్కరోజే రెండు వేర్వేరు చోట్ల పులుల పంజా విసరడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సావోలి తహసీల్ పరిధిలోని ఖేడి అనే గ్రామానికి చెందిన స్వరూప టెల్తివార్ (50)అనే పొలంలో పత్తి ఏరుతుండగా పులి దాడి చేయడంతో ఈరోజు మరణించినట్టు చీఫ్ కన్జర్వేటివ్ అధికారి ప్రకాశ్ లోంకర్ వెల్లడించారు. అయితే, ఒక్క చంద్రాపూర్ జిల్లాలోనే ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన పెద్ద పులులు, చిరుతల దాడుల్లో 50 మంది మృత్యువాత పడినట్టు మరో అధికారి తెలిపారు. వీరిలో 44మంది పెద్ద పులుల దాడుల్లో మృతి చెందగా.. ఆరుగురు చిరుతల దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.
'అమ్మో పులి'.. ఒక్క జిల్లాలోనే 50మంది మృతి.. అధికారులకు మంత్రి వార్నింగ్! - మహారాష్ట్ర పులి అటాక్ అధికారులకు మంత్రి వార్నింగ్
మహారాష్ట్రలో పులులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పులులు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తాయోనన్న భయంతో అక్కడి ప్రజలు బతుకుతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే పులుల దాడుల్లో 50 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
పులి
మరోవైపు, ఈ పులుల దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోతుండటంపై మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆందోళన వ్యక్తంచేశారు. పులల బారి నుంచి మనుషుల ప్రాణాల్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వన్య మృగాల నుంచి మనుషుల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సమస్యాత్మకంగా ఉన్న పులులను బంధించి మనుషులకు ఉపశమనం కలిగించాలని సూచించారు.
Last Updated : Dec 15, 2022, 7:09 PM IST