తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రం అసలు వైఖరి వారికి అర్థమైంది' - అసోం ఎన్నికలు రాహుల్​ గాంధీ

భాజపాపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం వైఖరి గురించి అసోం ప్రజలకు అర్థమైందన్నారు.

భాజపాపై రాహుల్​ గాంధీ అసోం ఎన్నికలు, rahul accuses bjp assam polls
భాజపాపై రాహుల్​ గాంధీ

By

Published : Mar 30, 2021, 3:57 PM IST

కేంద్రం చెప్పే మాటలకు, చేతలకు సంబంధం లేదని అసోం ప్రజలకు అర్థమైందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. భాజపా ప్రభుత్వం కేవలం వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తోందని, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్​ మంగళవారం ట్వీట్​ చేశారు.

"రోజువారీ కూలీలు, టీ ఎస్టేట్స్​లో పనిచేస్తున్న వారి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? కేంద్రం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదని ప్రజలకు అర్థమైంది."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

అసోంలో ఏప్రిల్​ 1న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి :'కేరళలో ఆ రెండు కూటముల​ మ్యాచ్ ఫిక్సింగ్'

ABOUT THE AUTHOR

...view details