బిహార్లో ముఖ్యమంత్రి పదవిపై తాను ఎలాంటి ప్రకటన చేయలేదని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్డీఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు నితీశ్. సంకీర్ణ భాగస్వామిగా ఎన్డీఏతో కలిసి పనిచేయడమే తమ విధానమని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)కు ఓట్ల నష్టం కలిగించిన లోక్ జన్ శక్తి(ఎల్జేపీ).. ఎన్డీఏలో ఉండేదానిపై కూడా నిర్ణయించాల్సింది భాజపాయేనని చెప్పారు నితీశ్. సీఎం పదవికి తాను దూరంగా ఉండాలంటూ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేయడం.. అది ఆయన అభిప్రాయమేనని నితీశ్ అన్నారు.