మనం సాధారణంగా అపోహలను అస్సలు నమ్మం, మూఢనమ్మకాలను కొట్టిపారేస్తాం. కానీ 700 ఏళ్లుగా ప్రజల మనసుల్లో ఆ భయం పాతుకుపోయింది.
ఇది ఓ గ్రామాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ శాపం కథ. 700 ఏళ్ల క్రితం భూమియా అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు ఆవులంటే మహాప్రీతి. ఓసారి ఊరి నుంచి కొందరు దుండగులు ఆవులను దొంగిలించడం చూశాడు భూమియా. దొంగలతో పోరాడి.. ఆవులను రక్షిస్తాడు. తీవ్ర గాయాలతో పక్క ఊరు అస్పలాసార్‌లోని అత్తవారింటికి వెళ్తాడు. రెండో అంతస్తులోని ఓ గదిలో తలదాచుకుంటాడు. కానీ, భూమియాను వెదుక్కుంటూ దొంగలు ఆ ఇంటికీ వెళ్తారు. కింద అంతస్తులోని కుటుంబసభ్యులపై దాడిచేస్తారు. వాళ్లు భయపడి, భూమియా పై అంతస్తులోని గదిలో ఉన్నట్లు చెబుతారు. ఆగ్రహంతో పైకి వెళ్లి, భూమియా తల నరికేస్తారు దొంగలు. ఈ ఘటనతో తీవ్ర కలత చెందిన భూమియా భార్య.. గ్రామస్థులను శపిస్తుంది.
ఊరిప్రజలు శాపం కారణంగా బాధలు పడ్డ తర్వాత, రెండో అంతస్తు నిర్మించకూడదని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ముగ్గరు ప్రయత్నించినా కట్టలేకపోయారు. 600 ఏళ్ల కిందటి మాట ఇది.
--స్థానికుడు.
రెండో అంతస్తు కట్టకపోవడం ఊర్లో చాలాకాలంగా కొనసాగుతున్న ఆచారం.
--స్థానికుడు.
అనంతరం, భూమియా... ఉడ్‌సర్ ప్రజల గ్రామదేవతగా మారినట్లు, గుడి కూడా కట్టినట్లు చెబుతారు. ఆ గాథను ఇప్పటికీ బలంగా నమ్ముతారు.