తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. ప్రజలకు మోదీ శుభాకాంక్షలు - హోలీ సంబరాలు

PM Modi Holi: హోలీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రంగుల పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు.

Holi Celebrations
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

By

Published : Mar 18, 2022, 8:44 AM IST

Holi Celebrations india: రంగుల పండగ హోలీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

హోలీ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా, రాజ్​నాథ్ సింగ్, ముక్తార్​ అబ్బాస్ నఖ్వీ కూడా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్ మథురలో హోలీ వేడుకలు

ఉత్తర్​ప్రదేశ్ మథురలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు.

ఉత్తర్​ప్రదేశ్ మథురలో హోలీ వేడుకల్లో భారీగా పాల్గొన్న ప్రజలు

గుజరాత్​లో చిన్నారులు, మహిళలు రంగల జల్లుకుని నృత్యాలు చేసి హోలీ పండగ చేసుకున్నారు.

గుజరాత్ వడోదరలో హోలీ వేడుకలు
గుజరాత్ వడోదరలో హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు

హోలీ సందర్భంగా హోలికా దహన్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

హోలికా దహనంలో పాల్గొన్న ప్రజలు
హోలికా దహనం

ABOUT THE AUTHOR

...view details