తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'24x7 ఎప్పుడైనా కొవిడ్​ టీకా​ తీసుకోవచ్చు'

ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్​ టీకా తీసుకునేందుకు వీలు కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకే టీకా పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించినట్లు చెప్పారు.

Harsha vardhan
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​

By

Published : Mar 3, 2021, 3:01 PM IST

Updated : Mar 3, 2021, 3:16 PM IST

ఎక్కువ మందికి టీకా అందించేందుకు.. కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీ సమయంపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ప్రజలు వారికి అనువైన సమయంలో 24x7 ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని వెల్లడించారు.

దేశ పౌరుల ఆరోగ్యంతో పాటు సమయానికి ఉన్న విలువను ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్​ చేశారు.

మంగళవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రులతో సమావేశంలో ఇదే విషయం చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. వ్యాక్సిన్​ పంపిణీ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనేది తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా వ్యాక్సినేషన్​ చేసేందుకు సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి టీకా పంపిణీ చేయొచ్చని వివరించారు.

తొలి డోసు తీసుకున్న కరోనా యోధులకు ఫిబ్రవరి 13 నుంచి కొవిడ్​-19 వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి వ్యాక్సినేషన్​ రెండో దశను ప్రారంభించారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు అంతకన్నా ఎక్కువ ఉండి ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి వ్యాక్సిన్​ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.56 కోట్ల డోసులు ఇచ్చారు.

ఇదీ చూడండి:కొవిడ్​ టీకా తీసుకున్న రాష్ట్రపతి, సీఎంలు

Last Updated : Mar 3, 2021, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details