కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది.పింఛనుదారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్) సమర్పణ తేదీని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దీంతో కరోనా వైరస్ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన పింఛనుదారులకు ఊరట లభించనుంది.
బయోమెట్రిక్ పరికరాలు ఉంటే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవచ్చని మంత్రి తెలిపారు. ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతోనూ జీవన ప్రమాణ పత్రం పొందవచ్చని సూచించారు.