ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సి ఉన్న 'జేఈఈ-మెయిన్స్' రెండు పరీక్షలను జులై నెలాఖరు లేదా ఆగస్టులో జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ యోచిస్తోంది. అలాగే వైద్యవిద్య ప్రవేశపరీక్ష నీట్‌ను సెప్టెంబరుకు వాయిదావేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. 'జేఈఈ-మెయిన్స్' రెండు పరీక్షలను రెండు వారాల వ్యవధిలో నిర్వహిస్తారని తెలిపాయి.
జేఈఈ-మెయిన్స్ పరీక్షలు వాయిదా!
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 'జేఈఈ-మెయిన్స్' సహా నీట్ పరీక్షలు వాయిదా వేసేందుకు కేంద్రం యోచిస్తోంది. జేఈఈ-మెయిన్స్‌ను జూలై నెలాఖరు లేదా ఆగస్టులో.. నీట్‌ను సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తోంది.
జేఈఈ-మెయిన్స్ పరీక్షలు వాయిదా!
దేశంలో జేఈఈ-మెయిన్స్‌ను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తారు. తొలి విడత ఫిబ్రవరిలోను, రెండో విడత మార్చిలోనూ నిర్వహించగా తదుపరి ఏప్రిల్, మే నెలల్లో జరపాల్సిన రెండు పరీక్షలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.
ఇదీ చదవండి :20 ఏళ్ల నాటి కల.. ఆరు పదుల వయసులో డాక్టరేట్