భారత్లోని కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను సైబర్ నిఘా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది. ఆ కథనాలకు సరైన ఆధారాలు లేవని, అవన్నీ వాస్తవదూరంగా ఉన్నాయని పేర్కొంది. వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ మేరకు స్పష్టత ఇస్తున్నట్లు వివరించింది. దీనిపై పరువు నష్టం దావానూ వేయనున్నట్లు తెలిపింది.
"ఇటీవల వచ్చిన కథనంలోని ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవం. తప్పుడు ఊహాగానాలతో ఎలాంటి ధ్రువీకరణ లేని విషయాలను కథనంలో పేర్కొన్నారు. వారి 'విశ్వసనీయ వర్గాలు' వారికి వాస్తవ దూరంగా ఉన్న సమాచారాన్ని ఇచ్చినట్లు ఉన్నాయి. మా సర్వర్ల నుంచి డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు. ఎందుకంటే మా సర్వర్లలో అలాంటి సమాచారమే లేదు."
-ఎన్ఎస్ఓ గ్రూప్
మరోవైపు, ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కథనాలను 'అంతర్జాతీయ కుట్ర'గా ఎన్ఎస్ఓ గ్రూప్ పేర్కొంది. తమ క్లెయింట్ల జాబితాలో లోని దేశాల పేర్లనూ కథనంలో పేర్కొన్నారని పేర్కొంది. పెగాసస్ సాఫ్ట్ ఫోన్లలోకి చొరబడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలిన వ్యాఖ్యలకు ఆధారాలు లేవని తెలిపింది.
"మేం మా సాఫ్ట్వేర్లను ప్రభుత్వాలు, నిఘా సంస్థలకు విక్రయిస్తాం. మాకు విశ్వసనీయమైన వినియోగదారులు ఉన్నారు. మాకు సర్వర్లు లేవు. క్లయింట్ల వద్దే డేటా అంతా ఉంటుంది. 50 వేలకు పైగా పెగాసస్ లక్ష్యాలను గుర్తించినట్లు వారు(వార్తా సంస్థలు) మాకు చెప్పారు. అది చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడేమో 180 అంటున్నారు. అది క్రమంగా 37.. ఆ తర్వాత 12కు చేరింది. బయటకు వచ్చిన డేటా.. ఏదో ఇతర జాబితాకు సంబంధించినదై ఉండొచ్చు. మానవహక్కుల మార్గదర్శకాలన్నింటినీ మేం పాటిస్తాం. ప్రాథమికంగా ఈ వ్యవహారం వెనక పోటీదారుల హస్తం ఉందని అనుకున్నాం. కానీ ఇది అంతర్జాతీయ కుట్ర అని స్పష్టమవుతోంది."
-ఎన్ఎస్ఓ గ్రూప్
ఇదీ చదవండి:Pegasus Spyware: 'పెగాసస్' వల పెద్దదే!
ఏంటీ వివాదం