దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్ ఫోన్ల హ్యాకింగ్(pegasus spyware india) వ్యవహారం గుట్టు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని(committee on pegasus) ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. అందులో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్, హార్డ్‌వేర్ నిపుణులను ఎంపిక చేసింది. ఈ దర్యాప్తును సుప్రీం కోర్టు(pegasus news supreme court) విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి రవీంద్రన్ పర్యవేక్షించనున్నారు. ఆయనకు.. మాజీ ఐపీఎస్ అధికారి అలోక్ జోషి, సందీప్ ఓబెరాయ్ సాయంగా ఉండనున్నారు.
సుప్రీం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో(committee on pegasus) నవీన్ కుమార్ చౌదరి, ప్రబహరన్ పి. అశ్విన్ అనిల్ గుమాస్తే ఉన్నారు. వారి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..
నవీన్ కుమార్ చౌదరి..
- గుజరాత్, గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీన్.
- సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్.
- సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్ వల్నెరెబిలిటీ అసెస్మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్‌లో రెండు దశాబ్దాల అనుభవం.
ప్రబహరన్...
- కేరళ, అమృతపురిలోని అమృత విశ్వ విద్యాపీఠంలో ప్రొఫెసర్(స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్)గా విధులు నిర్వర్తిస్తున్నారు.
- కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీ విభాగంలో రెండు దశాబ్దాల అనుభవం.
- మాల్వేర్ గుర్తింపు, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, కాంప్లెక్స్ బైనరీ అనాలసీస్, కృత్రిమ మేథ, మిషన్ లర్నింగ్‌లో నిపుణులు
- గుర్తింపు పొందిన జర్నల్స్‌లో సైబర్ సెక్యూరిటీపై ఆయన రాసిన కథనాలు ప్రచురితమయ్యాయి.
అశ్విన్ అనిల్ గుమాస్తే..
- బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.
- గుమాస్తే ఆవిష్కరణలకు అమెరికా నుంచి 20 పేటెంట్లు పొందారు. 150 పేపర్లు పబ్లిష్ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్‌లో మూడు పుస్తకాలు రాశారు.
- విక్రమ్ సారాభాయ్ రీసర్చ్ అవార్డ్ (2012), శాంతి స్వరూప్ భడ్నాగర్ ప్రైజ్ (2018) సహా పలు జాతీయ అవార్డులు అందుకున్నారు.
- అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విజిటింగ్ సైంటిస్ట్‌గానూ పని చేశారు.
నిజానికి.. నిపుణుల కమిటీని తామే నియమిస్తామని కేంద్రం ప్రతిపాదించగా.. సుప్రీంకోర్టు తిరస్కరించింది. అటువంటి చర్య పక్షపాత ధోరణిని వ్యతిరేకించే న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించటమేనని పేర్కొంది.
సుప్రీం కీలక వ్యాఖ్యలు..
వ్యక్తుల గోప్యత హక్కు(pegasus latest news) ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది సుప్రీం కోర్టు. పెగసస్‌పై(pegasus spyware case) వచ్చిన ఆరోపణలను.. క్షుణ్నంగా పరిశీలించి నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. పెగసస్ స్పైవేర్‌తో పౌరులపై నిఘా పెట్టడం సహా, ఇందులో విదేశీ సంస్థల ప్రమేయం ఉండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పెగసస్ వ్యవహారంపై.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలు, వారి అభిప్రాయాలను చెప్పేందుకు అనేక అవకాశాలిచ్చామని పేర్కొంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అసంపూర్ణంగా అఫిడవిట్ సమర్పించిందని అసహనం వ్యక్తం చేసింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అన్నదానిపై కచ్చితమైన సమాధానం రాలేదన్న కోర్టు.. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించిందని వెల్లడించింది. కమిటీ ఏర్పాటుకు.. కేంద్రం సైతం సుముఖంగా ఉన్నందున ముందడుగు వేశామని.. సుప్రీం ధర్మాసనం వివరించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి:పెగసస్‌పై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు- సుప్రీం ఉత్తర్వులు