తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెగసస్​పై కేంద్రం 10 రోజుల్లో సమాధానం చెప్పాలి'

జాతీయ భద్రత విషయంలో రాజీపడే ఏ అంశాన్ని కూడా కేంద్రం వెల్లడించాలని తాము కోరడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెగసస్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్​లపై వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

pegasus issue
పెగసస్‌ స్పై వేర్‌

By

Published : Aug 17, 2021, 1:20 PM IST

Updated : Aug 17, 2021, 3:23 PM IST

పెగసస్‌ స్పైవేర్‌ ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయులపై నిఘా జరిగిందన్న వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం 10 రోజుల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. పెగసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై వరుసగా రెండో రోజు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఏ వైఖరి అనుసరించాలి అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని తెలిపింది.

పిటిషనర్లు కోరినట్లుగా నిఘాకు సంబంధించిన సమాచారం కోర్టుకు వెల్లడించడం జాతీయ భద్రతపై రాజీతో కూడుకున్న అంశం అని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌ సరిపోతుందని, అంతకు మించిన సమాచారం కొత్తగా ఏమీ లేదని వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం జాతీయ భద్రత విషయంలో రాజీపడే ఏ అంశాన్ని కూడా కేంద్రం బయటకు వెల్లడించాలని తాము కోరడం లేదని స్పష్టం చేసింది. పిటిషన్‌లపై విచారణను 10 రోజుల తర్వాత చేపడతామని తెలిపింది.

పెగసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని భారత ఎడిటర్‌ గిల్డ్‌ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తోంది

Last Updated : Aug 17, 2021, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details