తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pegasus Spyware: కేంద్రానికి మరింత సమయం ఇచ్చిన సుప్రీం - పెగసస్​ వ్యవహారం

పెగసస్‌ (Pegasus Spyware) పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు(Supreme court on Pegasus) మరింత సమయం ఇచ్చింది. పలు కారణాల వల్ల అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోతున్నామని ధర్మాసనానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విన్నవించారు. విచారణను ఈనెల 9కి గానీ... 13 కు గానీ వాయిదావేయాలని(Pegasus snooping row) కోరారు.

pegasus controversy
సుప్రీంలో పెగసస్​ విచారణ

By

Published : Sep 7, 2021, 1:34 PM IST

పెగసస్‌ వ్యవహారంలో(Pegasus Spyware) నమోదైన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు(Supreme court on Pegasus) మరింత సమయం ఇచ్చింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. పలు కారణాల వల్ల అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోతున్నామని విచారణను ఈనెల 9కి గానీ... 13 కు గానీ వాయిదావేయాలని(Pegasus snooping row) ధర్మాసనాన్ని కోరారు.

పెగససస్​ పిటిషన్లపై ఆగష్టు 17ననే కేంద్రానికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కానీ కౌంటర్ దాఖలు చేయలేకపోయినందున సెప్టెంబరు 13కు వాయిదా వేసింది.

పెగసస్‌ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ సహా పన్నెండింటిని సుప్రీం ధర్మాసనం విచారణ చేస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగసస్‌ని ఉపయోగించి దేశంలోని 300కు పైగా ప్రముఖుల ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

ఇదీ చదవండి:'పెగసస్​పై అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోం!'

ABOUT THE AUTHOR

...view details