తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెగాసస్'​పై సుప్రీం కోర్టుకు రాజ్యసభ ఎంపీ​ - పెగాసస్​పై ​సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్

పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు పెగాసస్​పై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత పీ చిదంబరం డిమాండ్​ చేశారు.

Supreme court
సుప్రీంకోర్టు

By

Published : Jul 25, 2021, 6:04 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ సాయంతో సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, పాత్రికేయులు, రాజ్యాంగ విధుల్లో ఉన్నవారిపై నిఘా ఉంచారన్న కథనాలపై జాన్ బ్రిట్టాస్ ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ ఆరోపణలు దేశ ప్రజలలో ఆందోళన రేకెత్తించాయన్న పిటిషనర్​.. నిఘా ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరారు.

'పెగాసస్​పై పార్లమెంటులో మాట్లాడాలి'

పెగాసస్​ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ.. పార్లమెంటులో మాట్లాడాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ సీనియర్ నేత పీ చిదంబరం. పెగాసస్ ద్వారా నిఘా ఉంచారా.. లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే ఈ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలి లేదా ఈ విషయంపై సిట్టింగ్​ జడ్జీతో దర్యాప్తు చేపట్టాలని సుప్రీం కోర్టును కోరారు. పెగాసస్​ స్పైవేర్​.. 2019 సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసిందని చెప్పలేమన్న చిదంబరం.. భాజపా విజయానికి సాయపడి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.

నిరాధారమైన ఆరోపణలు

పెగాసస్​ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు లేవనత్తడానికి ఏ అంశాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నో కీలకమైన అంశాలపై కేంద్రం చర్చించడానికి ప్రయత్నస్తుంటే కాంగ్రెస్​ నేతృత్వంలోని విపక్షాలు అర్థంలేని సమస్యలతో ఆందోళనలు చేస్తూ.. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details