తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొలంలో పెట్టిన ఎలుకల మందు తిని 21 నెమళ్లు మృతి - తమిళనాడు క్రైం

peacocks died in Tamilnadu: తమిళనాడులో దారుణం జరిగింది. పొలంలో ఓ రైతు పెట్టిన ఎలుకల మందు తిని 21 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని పోలీసులు అరెస్ట్ చేశారు.

peacocks died
నెమళ్లు మృతి

By

Published : Mar 12, 2022, 11:02 PM IST

peacocks died in Tamilnadu: పొలంలో రైతు పెట్టిన ఎలుకల మందును తిని 21 నెమళ్లు చనిపోయాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన తమిళనాడు తిరుపత్తూర్​ సమీపంలోని కురుమ్​పత్తిలో జరిగింది.

విగత జీవులగా మారిన నెమళ్లు

తన వరి పొలంలో ఎలుకలను నివారించడానికి షణ్ముగం అనే రైతు ఎలుకల మందును పెట్టాడు. పొలంలోకి వచ్చిన నెమళ్లు ఆ ఎలుకల మందును తినేశాయి. దీంతో అవి అక్కడికక్కడే మృతిచెందాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నెమళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రైతు షణ్ముగాన్ని అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు.

పోలీస్ స్టేషన్​లో నెమళ్ల మృతదేహలు
రైతుని అరెస్ట్​ చేసిన పోలీసులు

ఇదీ చదవండి:చిరుత మాంసంతో విందు.. చర్మాన్ని విక్రయిస్తూ అడ్డంగా..!

ABOUT THE AUTHOR

...view details