తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ హితం కోసం వారు సత్యాగ్రహం చేస్తున్నారు'

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న రహదారుల దిగ్బంధాన్ని శాంతియుతమైన సత్యాగ్రహంతో పోల్చారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. సాగు చట్టాలు రైతులకే కాదు దేశ ప్రజలందరికీ హానికరం అన్నారు.

RAHUL-FARMERS
'దేశ హితంకోసం వారు సత్యాగ్రహం చేస్తున్నారు'

By

Published : Feb 6, 2021, 1:09 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న రహదారుల దిగ్బంధాన్ని(చక్కా జామ్) సత్యాగ్రహంతో పోల్చారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ. దేశ హితం కోసం రైతులు చేస్తోన్న శాంతియుత సత్యాగ్రహం ఇదని పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకే కాదు దేశ ప్రజలందరికీ హానికరమని అన్నారు. తక్షణమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

చక్కా జామ్​ నేపథ్యంలో దిల్లీ రహదారులలో భారీ ఎత్తున ఇనుప కంచె ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రైతులను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:దిల్లీ​ సరిహద్దుల్లో 50 వేల మంది బలగాల మోహరింపు

ABOUT THE AUTHOR

...view details