సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత కాపాడుకోవటంలో భారత్ దృఢ నిశ్చయంతో ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఏకపక్ష ధోరణి, దుందుడుకు చర్యలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.
నేషనల్ డిఫెన్స్ కాలేజీ నిర్వహించిన వర్చువల్ సెమినార్లో పాల్గొన్న రాజ్నాథ్.. సరిహద్దుల్లో శాంతికి సంబంధించిన ఒప్పందాలను గౌరవిస్తామని చెప్పారు. విభేదాల విషయంలో చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారానికి ప్రాముఖ్యం ఇస్తామని స్పష్టం చేశారు.
చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్ని ఏడు నెలలు కావొస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి.
"భారత్ శాంతికాముక దేశం. విభేదాలు వివాదాలుగా మారకూడదని నమ్ముతుంది. యుద్ధాన్ని నివారించే లేదా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నప్పుడే శాంతి కోసం కృషి చేయగలం. ఇందుకోసం స్వదేశీకరణ మంత్రంతో ముందుకు సాగుతున్నాం."