తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ జర్నలిస్టులను 'కరోనా యోధులు'గా గుర్తించాలి: పీసీఐ - journalists in covid time

కరోనా వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులను 'కొవిడ్​ యోధులు'గా పరిగణించాలని కేంద్రానికి ప్రెస్​ కౌన్సిల్​​ ఆఫ్​ ఇండియా విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.

PCI asks Centre to treat journalists who died due to coronavirus as 'COVID warriors'
ఆ జర్నలిస్టులను 'కొవిడ్​ యోధులు'గా గుర్తించాలి: పీసీఐ

By

Published : Dec 4, 2020, 6:31 AM IST

కరోనా కారణంగా మృతిచెందిన పాత్రికేయులను 'కొవిడ్​ యోధులు'గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్​ కౌన్సిల్​​ ఆఫ్​ ఇండియా(పీసీఐ) కోరింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి అందించే ప్రయోజనాలనే జర్నలిస్టులకూ అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖను రాసింది.

హరియాణా సర్కారు అందిస్తున్నట్లుగా.. పాత్రికేయుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలని ప్రెస్​ కౌన్సిల్​ తీర్మానించింది. ప్రెస్​ అసోసియేషన్​, ఇతర పాత్రికేయ సంఘాలు ఈ తీర్మానంలో సంతకం చేశాయి. తీర్మానంతో పాటుగా సమాచార మంత్రిత్వ శాఖకు, అన్ని రాష్ట్రాల, కేంద్రాల సీఎస్​లకు పీసీఐ లేఖలు రాసింది.

ఇదీ చూడండి:'ఈ నెలలోనే కరోనా టీకాకు అనుమతులు!'

ABOUT THE AUTHOR

...view details