పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బులు కాజేసిన ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. రూ.20వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి కేసును ఎప్పుడూ చూడని బ్యాంకు సిబ్బంది, పోలీసులు.. ఏం చేయాలా అని తలపట్టుకుంటున్నారు.
ఏం జరిగింది?
అనీస్ రహ్మాన్.. కేరళ మలప్పురం జిల్లా వండూర్ వాసి. బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.20వేల రూపాయలు విత్డ్రా అయినట్లు తెలిసింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. మూడు సందర్భాల్లో పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు తనకు పేటీఎం అకౌంట్ లేదని, ఈ బ్యాంకు ఖాతాతో లింక్ కాలేదని అనీస్ చెప్పాడు. ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు.