కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించుకొనే యత్నాల్లో భాగంగా విపక్షాలు శుక్రవారం భేటీ కానున్నాయి. వర్చువల్ విధానంలో కొనసాగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఇప్పటికే పలువురు నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి.
సోనియా నేతృత్వంలో నేడు విపక్షాల భేటీ
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేడు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా తదితరులు హాజరుకానున్నారు.
సోనియా గాంధీ
సమావేశంలో పాల్గొనేందుకు సుముఖత తెలుపుతూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, టీఎంసీ అధ్యక్షురాలు, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ తిరుగు సమాధానమిచ్చినట్లు సమాచారం.
ఇదీ చూడండి:'పెట్రోల్ చౌకగా కావాలంటే.. అఫ్గానిస్థాన్ వెళ్లండి'