Pawan Kalayn At Nara Lokesh Yuvagalam Public Meeting: చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగిందని, కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని మద్దతు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. నారా లోకేశ్ ‘యువగళం-నవశకం’ ముగింపు సభలో పవన్ మాట్లాడారు. తాను ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ పేర్కొన్నారు. మార్పు తీసుకువస్తాం, జగన్‌ను ఇంటికి పంపుతామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జగన్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, సీఎం జగన్‌ను మార్చాలని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదని, ఏదైనా మాట్లాడితే దూషిస్తారు, దాడులు చేయిస్తారని పవన్ ఆరోపించారు. తల్లి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి, ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తారంటూ పవన్ ఎద్దేవా చేశారు.
విజయవంతమైన 'యువగళం-నవశకం" భారీ బహిరంగ సభ
ఇళ్లలో ఉండలేని పరిస్థితులు: వైఎస్సార్సీపీ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, కొండలు, కోనలను సైతం ఆక్రమిస్తున్నారని పవన్ వెల్లడించారు. మరో సారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ఎవరూ ఇళ్లలో ఉండని పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. మరో సారి ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఉపాధి కల్పన జరగదని పవన్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్న పవన్, వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు ఒకే వేదికపైకి రావడం సంతోషకరమని తెలిపారు. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ అంధకారం అవుతుందన్న పవన్, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి: చంద్రబాబు