Pawan Kalyan Election Campaign : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటన ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. ఈ నెలలో ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు.. జనసేన జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గోదావరి జిల్లాలో పవన్ ఏయే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.. పర్యటనలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను తెలిపారు. పర్యటన ఎన్ని రోజులు కొనసాగనుంది వంటి వివరాలను నాదెండ్ల వివరించారు.
గోదావరి జిల్లాల్లో పర్యటన వివరాలు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగనున్న ఈ యాత్ర.. తొలుత తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉంటుందని.. ఒక్కో నియోజవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని, అందుకు తగినట్లుగా ప్రణాళిక తయారు చేసినట్లు వివరించారు.
Nadendla Manohar Comments On Ysrcp: జీవో నంబర్ 1ని హైకోర్టు కొట్టివేయడం గొప్ప తీర్పు :మనోహర్
వారాహిపై ప్రచార యాత్ర : పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో చేపడుతున్న ఈ యాత్ర.. పవన్ తన ఎన్నికల ప్రచార రథమైన వారాహిపై నిర్వహించనున్నారు. ఇప్పటికే యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైనట్లు నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో పవన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనసేన ద్వారా క్షేత్ర స్థాయిలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.