తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pawan Tweet on Jagan: జగన్​పై పవన్​ ట్వీట్ల వర్షం.. ఈసారి ఏకంగా - కార్ల్ మార్స్క్

Pawan Counter to CM Jagan: సీఎం జగన్​పై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను గురించి వివరిస్తూ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఏం విషయంపై ట్వీట్​ చేశారంటే..?

Pawan Counter to CM Jagan
Pawan Counter to CM Jagan

By

Published : May 19, 2023, 12:11 PM IST

Pawan Counter to CM Jagan: ముఖ్యమంత్రి జగన్​పై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ట్విట్ల ద్వారా విరుచుకుపడుతున్నారు. మన సీఎంపై 'పాపం పసివాడు' సినిమా ఎవరైనా తీస్తారా అంటూ మొన్న ట్వీట్​ చేసిన పవన్​, నేడు అన్నమయ్య డ్యాం విషయంలో జగన్​ ప్రభుత్వ నిర్లక్ష్యం, మోసాలను వివరిస్తూ మరోసారి ట్విట్టర్​ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ పవన్​ ట్వీట్​లో ఏముందంటే.. "అధికారికంగా 500 కోట్ల రుపాయల విలువైన ఏపీ సీఎం (అన్ని సీఎం లలో అత్యంత ధనవంతుడు) గురించి నిరంతరం మాట్లాడే వారికి సున్నితమైన రిమైండర్. కార్ల్ మార్స్క్​ లాగా 'వర్గయుద్ధం'. 'అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం'. ఇలాంటి ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి ఏపీ మానవ హక్కుల సంఘాలను సంప్రదించండి" అని ట్వీట్​ చేశారు.

మరో ట్వీట్​లో.. "2021 నవంబర్​ 19వ తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయ్యేరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద కనుక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారు.

ప్రమాద ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో, AP CM ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి" అని వ్యంగంగా ట్వీట్​ చేశారు.

ఇంకా మరో దానిలో అన్నమయ్య డ్యామ్​ని తిరిగి పూర్తి స్థాయిలో పునఃనిర్మాణం చేసి ఒక సంవత్సరం లోగా ఆయకట్టు దారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి సంగతేమో కానీ కనీసం ఈరోజుకి కూడా పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్ల రూపాయలకు అప్పచెప్పారు" అని పవన్​ ట్వీట్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details