తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pawan Sensational Comments: నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను దింపారు: పవన్​కల్యాణ్​ ​ - pawan sensational comments on security

Pawan Kalyan East Godavari District Tour: జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. సుపారీ గ్యాంగులను దింపారని, వారు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని అన్నారు. ఏం చేయడానికైనా వారు సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు చేశారు.

Pawan Kalyan
పవన్​ కల్యాణ్​

By

Published : Jun 18, 2023, 7:25 AM IST

నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను దింపారు: పవన్​

Pawan Kalyan Comments On His Security: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, కిరాయి ముఠాలను దింపారని వ్యాఖ్యానించారు. కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. జనసేన నాయకులంతా తప్పనిసరిగా భద్రత ప్రోటోకాల్‌ పాటించాలని కోరారు. శనివారం రాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల కలిసి పవన్​ సమావేశమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవడానికి వీల్లేకుండా చేయాలనే లక్ష్యంతో పని చేయాలని.. జనసేన పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల కోసం పవన్​ కల్యాణ్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వారాహి యాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే ఈ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ప్రాణహాని ఉంది..:ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులతో సమావేశమైన సందర్భంగా పవన్​ మాట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉందని ఆయన అన్నారు. భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.

అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే దిశగా జనసేన పయనిస్తోందని పవన్​ అన్నారు. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని.. తనను భయపెట్టే కొద్ది మరింత రాటు దేలుతానని అభిప్రాయం వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో ఒక్కటీ వైసీపీకి దక్కకూడదన్నారు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసేందుకు జనసేన పార్టీ ప్రణాళిక ఉండాలని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే జనసేన సవరణలు మొదలుపెడుతోందని వెల్లడించారు. జనసేన ఇక్కడి నుంచే విజయ కేతనం ఎగర వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

2006లో తాను రాజకీయాల్లోకి రాకముందే రాకూడదని భావించారని.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను బతకనిస్తారా అని పవన్​ కల్యాణ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడే తనను అన్యాయంగా దూషిస్తే.. ఆరోజు అంతకు మించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదని పేర్కొన్నారు. వారు చేసిన పనికి తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుందని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలు రెండు జనసేనకు అడ్డాగా మారాలని నాయకులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details