Pawan Kalyan Attend BJP Janasena Meeting in Kukatpally : జనసేన పార్టీ ఆవిర్భావం.. తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణలో జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తాను కోరుకున్న స్ఫూర్తినిచ్చిన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడి యువత కోరుకున్నది ఒక్కటే.. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారన్నారు. తాము సాధించుకున్న తెలంగాణలో అవినీతితో ఉద్యోగాలు సాధించుకునేందుకేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ-జనసేన విజయ సంకల్ప సభ(BJP-Congress Sabha)లో పాల్గొని ప్రసంగించారు.
ప్రజలను కలవని సీఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? : మోదీ
Telangana Election Polls 2023 : అందుకే నిరుద్యోగులు, యువత కష్టాల్లో తోడుగా ఉంటానని మాటిచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) జనసేనకు మద్దతు తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలకు జనసేనాని పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో మొదటగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారనుకుంటే.. ఆఖరి క్షణంలో ఆయన రాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా(JP Nadda) వచ్చారు.
"ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడ్డారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. ఉత్తరాంధ్రకు చెందిన 26 వెనకబడిన కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారు. జనసేన కూటమి అధికారంలోకి రాగనే 26 కులాలకు న్యాయం చేస్తాము. ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లాను."- పవన్ కల్యాణ్, జనసేన అధినేత