తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pattabhi Questioned Sakshi Media in SIT Office: చంద్రబాబు విచారణ గదిలో బ్లూ మీడియా.. వారికి ఎలా అనుమతించారు? - Chandrababu Arrest in Skill Development Case

Pattabhi Questioned Sakhi Media in SIT Office : సిట్​ కార్యాలయంలో చంద్రబాబు విచారణ సమయంలో సాక్షి మీడియాకు సంబంధించిన కెమెరామెన్​, ఫొటోగ్రాఫర్​ ఉండడంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మండిపడ్డారు. చంద్రబాబు ఫొటోలను, వీడియోలను తీయించి, బ్లూ మీడియా ద్వారా లీక్​ చేశారని వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలోని తన నివాసం నుంచి సాక్షి పేపర్​కు సంబంధించిన వారి ఫొటోలను ఆయన విడుదల చేశారు.

sakshi media person in sit enquiry room
sakshi media person in sit enquiry room

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 10:16 AM IST

Updated : Sep 10, 2023, 10:45 AM IST

Pattabhi Questioned Sakshi Media in SIT Office : సిట్(SIT)​ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu)ను విచారిస్తున్న వేళ.. మీడియా ప్రతినిధులను ఎవరిని లోపలికి రానివ్వని పోలీసులు.. సాక్షి మీడియా(Sakshi Media)ను మాత్రమే ఎందుకు అనుమతించారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్​ తెలిపారు. చంద్రబాబు ఫొటోలను, వీడియోలను తీయించి, బ్లూ మీడియా ద్వారా లీక్​ చేశారని వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలోని తన నివాసం నుంచి.. చంద్రబాబును విచారిస్తున్న గదిలో ఉన్న సాక్షి కెమెరామెన్​ సత్య, సాక్షి ఫొటోగ్రాఫర్​ పవన్​ ఫొటోలను పట్టాభి రిలీజ్​ చేశారు. అనంతరం అధికార పార్టీ వైసీపీ, బ్లూ మీడియాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సిట్​ కార్యాలయంలో మాజీ సీఎం చంద్రబాబును విచారిస్తున్నగదిలో సాక్షి కెమెరామెన్​ సత్య, సాక్షి ఫొటోగ్రాఫర్​ పవన్​ ఉండడం ఏంటని టీడీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. తమ నాయకుడు ఉన్న వీడియోలు, ఫొటోలు తీసి బయటకు విడుదల చేయడానికా.. లేక ఎప్పటిలాగే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారా అని వాపోయారు.

Andhra Ex CM Chandrababu Arrested :సీఐడీ అధికారులు తాడేపల్లి ప్యాలెస్​ చేతిలో కీలు బొమ్మలుగా మారారని.. ఈ మొత్తం వ్యవహారం అక్కడి నుంచే జరుగుతోందని విమర్శించారు. ఆ డైరెక్షన్​లోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారం నడుస్తోందని ధ్వజమెత్తారు. సిట్​ అధికారులు చంద్రబాబును విచారిస్తున్నట్లు, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నట్లు తప్పుడు ప్రచారం బ్లూ మీడియా చేస్తోందన్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేసేందుకే ఫొటోలు, వీడియోలను బ్లూ మీడియా లీక్​ చేసిందని పట్టాభిరామ్​ వెల్లడించారు. సాక్షి ఫొటో గ్రాఫర్​, కెమెరామెన్​ సిట్​ కార్యాలయానికి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో సాక్షి పత్రిక వారికి ఎక్కడికైనా ప్రవేశం ఉందా అని అడిగారు. మిగతా మీడియా వారికి లేని వెసులుబాటు.. కేవలం సాక్షికే ఎందుకని ప్రశ్నించారు.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

అసలేం జరిగింది : శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు బస చేస్తున్న నంద్యాలలోని ఆర్​కే ఫంక్షన్​ హాలుకు వెళ్లారు. బస్సులో నిద్రపోతున్న చంద్రబాబును అదుపులోకి తీసుకోవాలని చూశారు. కానీ ఆయనకు రక్షణగా నిలిచిన ఎన్​ఎస్​జీ అధికారులు అందుకు అభ్యంతరాలు తెలిపారు. ఎన్​ఎస్​జీ నిబంధనల ప్రకారం ఉదయం 5.30 గంటల వరకు ఆయనను కలిసేందుకు అనుమతి లేదని నిరాకరించారు. అయినా వినకుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

Chandrababu Arrest in Skill Development Case : ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని.. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్​ రెడ్డితో వాదించారు. అరెస్టు వారెంటు లేకుండా తమ నాయకుడిని ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. దీంతో సీఐడీ అధికారి అక్కడి వారితో దురుసుగా ప్రవర్తించారు. ఉదయం 6 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు పొడవునా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ.. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు రోడ్లపై పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Telugu Desam Activists Protest Across the State: అట్టుడికిన ఆంధ్రా.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

Ajeya kallam and Premchandra Reddy Approved the Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టును ఆమోదించింది అజేయకల్లం: పీవీ రమేశ్‌

Last Updated : Sep 10, 2023, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details