తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదింటి విద్యార్థికి రూ.2.5కోట్ల స్కాలర్​షిప్​.. అమెరికాలో ఉన్నత విద్య - బిహార్ న్యూస్

విద్యతోనే తన పేదరికాన్ని రూపుమాపొచ్చని అనుకున్నాడు ఆ విద్యార్థి. పట్టుదలతో చదివి అమెరికాలోని ఓ ప్రతిష్టాత్మక కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని సంపాదించాడు. ఇందుకోసం ఏకంగా రూ. 2.5 కోట్ల విలువైన స్కాలర్​షిప్​ను పొందాడు.

prem From Patna Got Scholarship
ప్రేమ్​కుమార్​

By

Published : Jul 8, 2022, 7:29 PM IST

బిహార్​ రాజధాని పట్నాకు చెందిన 17 ఏళ్ల నిరుపేద విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక లఫాయెట్టే కళాశాలలో ఉన్నత విద్య చదువుకోవడానికి రూ.2.5కోట్ల విలువైన స్కాలర్​షిప్​ను పొందాడు. ఈ మేరకు ప్రేమ్​ కుమార్​కు అంగీకార పత్రాన్ని పంపించింది కళాశాల యాజమాన్యం. "వెనుకబడిన వర్గాలకు సేవ చేయాలనే మీ నిబద్ధత, పట్టుదలను చూసి మేము ప్రేరణ పొందాము." అంటూ కళాశాల డీన్​ మాథ్యూ హైడ్​ అభినందన లేఖను పంపించారు.
1826లో స్థాపించిన లాఫయెట్టే అమెరికాలోని అత్యున్నత 25 కళాశాలల్లో ఒకటి. భారత దేశంలో ఇలాంటి ప్రతిష్టాత్మక కళాశాలలో సీటు సంపాందించిన మొదటి దళితుడు ప్రేమ్​ కుమార్.

విద్యార్థి ప్రేమ్​కుమార్​
చదువుతున్న ప్రేమ్​కుమార్

"నా చదువును దేశ అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను. విద్యార్థులు అందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలి. దళితుల విద్య కోసం డెక్స్​టెరిటీ గ్లోబల్ ఫౌండేషన్ ​చాలా కృషి చేస్తోంది. వారి సహకారంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్కాలర్​షిప్​ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. "

-ప్రేమ్​ కుమార్, విద్యార్థి​

పుల్వారి షరీఫ్​ గ్రామానికి చెందిన ప్రేమ్​ కుమార్​ నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతడి తండ్రి రోజూవారీ కూలీ పనులకు వెళ్తూ ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కుటుంబంలో చదువుకోవడానికి వెళ్లిన మొదటి వ్యక్తి ప్రేమే. ప్రస్తుతం అతడు శోశిత్​ సమాధాన్​ కేంద్రంలో 12వ తరగతి చదువుతున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్​, అంతర్జాతీయ సంబంధాలపై ఉన్నత విద్య అవకాశాన్ని సంపాందించాడు. ఈ స్కాలర్​షిప్​తో నాలుగేళ్ల చదువుతో పాటు అక్కడ నివసించడానికి సరిపోయే డబ్బును సైతం ఇస్తారు. ప్రతిష్టాత్మక 'డైర్​ ఫెలోషిప్​కు' ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు అర్హత సాధించగా.. అందులో భారత్ తరఫున ప్రేమ్ కుమార్ ఒకరు.

కుటుంబ సభ్యులతో

డెక్స్​టెరిటీ గ్లోబల్​ అనేది భారత దేశంలో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థలోని విద్యార్థులు ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల నుంచి 100కోట్లకు పైగా స్కాలర్​షిప్​లను సంపాదించారు. బిహార్​లోని మహాదళిత్​ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల అభ్యున్నతి కోసం 2013 నుంచి ఈ సంస్థ కృషి చేస్తోంది.

ఇదీ చదవండి:ప్రియుడ్ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. అతడు చేసిన పనితో గెస్ట్​లంతా షాక్

ABOUT THE AUTHOR

...view details