శరీరం, దుస్తులపై ఉన్న కరోనా వైరస్‌ను నాలుగు సెకన్లలో అంతంచేసే 'ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రం'ను (Covid Disinfection Machine) ఐఐటీ-పట్నా పరిశోధకులు రూపొందించారు. ప్రయోగాత్మకంగా దీన్ని పట్నాలోని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేశారు. దీని ద్వారం గుండా ఇవతలి నుంచి అవతలికి వెళ్తే సరిపోతుంది.
నాలుగు సెకన్లలో.. శరీరంపై కరోనాను అంతం చేసే యంత్రం - COVID DISINFECTION ON BODY
శరీరంపై కరోనాను అంతం చేసే డిసిన్ఫెక్ట్ యంత్రాన్ని (Covid Disinfection Machine) ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. దీన్ని ప్రయోగాత్మకంగా పట్నాలోని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేశారు.
కొవిడ్ డిస్ఇన్ఫెక్షన్ యంత్రం
ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, సురక్షితమైన ద్రావణాన్ని ఈ పరికరం పిచికారి చేస్తుంది. మూడు మోడళ్లలో ఈ యంత్రాన్ని రూపొందించామని, ఇందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని పరిశోధనకర్త వరుణ్ కుమార్ సాహి తెలిపారు. కరోనా విజృంభిస్తున్న (Covid news) సమయంలో ఈ పరికరం తయారీపై దృష్టి సారించామని, ఎలాంటి ద్రావణాన్ని వినియోగించడం వల్ల హాని ఉండదన్న విషయమై అనేక పరీక్షలు చేపట్టి దీనికి తుదిరూపు ఇచ్చామని చెప్పారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు