బిహార్లోని పాట్నాలో వింతైన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి నోట్లో 82 పళ్లు ఉన్నాయి. దవడ నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళితే అసలు విషయం భయటపడింది.
వింత సమస్య.. ఆ యువకుడి నోట్లో 82 పళ్లు! - అరుదైన వ్యాధి
సాధారణంగా మనుషులకు 32 పళ్లు ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. కొందరికి అంతకన్నా తక్కువే ఉంటాయి. కానీ, ఓ వ్యక్తికి 82 పళ్లు ఉన్నాయి. ఈ విషయం నమ్మశక్యంగా లేదు కదా? కానీ అది నిజం. అన్ని పళ్లు రావటానికి కారణమేంటి?
ఒడొంటొమా
పరీక్షలు నిర్వహించిన వైద్యులు రోగి దవడలో 82 పళ్లు ఉన్న కారణంగానే ఆ నొప్పి ఏర్పడిందని తేల్చారు. ఇది దవడలో ఏర్పడే ట్యూమర్ కారణంగా జరుగుతుందని వెల్లడించారు. దవడలో పళ్లు ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో చేరుతాయని తెలిపారు. దానిని ఒడొంటొమా అనే పేరుతో పిలుస్తారని చెప్పారు. ఆపరేషన్ చేసి ట్యూమర్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి:రాయిలా మారుతున్న చిన్నారి శరీరం!
Last Updated : Jul 11, 2021, 3:16 PM IST