తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లోని ఓ ఆస్పత్రిలో విషాద ఘటన జరిగింది. కరోనా సోకిన అన్నను స్ట్రెచర్​ లేక భుజాలపైనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు తమ్ముడు. అయినా ఆలస్యం కావడం వల్ల అతడు మరణించాడు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అదే ఆస్పత్రిలో సమావేశం నిర్వహిస్తుండగానే జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

స్ట్రెచర్ లేక భుజాలపైనే

By

Published : May 11, 2021, 9:14 PM IST

Updated : May 11, 2021, 11:03 PM IST

స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్ బీఆర్​డీ వైద్యకళాశాల ఆస్పత్రిలో ఓ కొవిడ్​ రోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కరోనా సోకి ఆరోగ్యం విషమించిన ఓ వ్యక్తిని అతని సోదరుడు భుజాలపైనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు. అయినా అతడ్ని అడ్మిట్ చేసుకోలేదు సిబ్బంది. ఫలితంగా కరోనా రోగి ప్రాణాలు కోల్పోయాడు.

స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం
స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇదే ఆస్పత్రిలో కరోనా పరిస్థితిపై సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. సీఎం ప్రోటోకాల్​ అమల్లో ఉన్నందున రోగి కుటుంట సభ్యులను కూడా ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంబులెన్స్​ను కొవిడ్ వార్డు వరకు తీసుకెళ్లమని వారు కోరినా.. డ్రైవర్ అందుకు నిరాకరించాడు. స్ట్రెచర్​ కోసం ప్రయత్నించినా అందుబాటులో లేదు. దీంతో భుజాలపైనే రోగిన తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆలస్యం కావడం వల్ల అతడు తమ్ముడి చేతుల్లోనే తుది శ్వాస విడిచాడు.

అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఇందులో తమ తప్పు లేదని చెప్పారు. స్ట్రెచర్​ ఆస్పత్రి లోపల అందుబాటులో ఉంటుంది గానీ రోడ్డుపై ఉండదని నిర్లక్షంగా సమాధానం చెప్పారు.

మరణించిన వ్యక్తి పేరు రాంబదన్​ కాగా.. అతడి సోదరుడి పేరు విష్ణు. ముంబయిలో పెయింటర్​గా పనిచేసే రాంబదన్ మూడు రోజుల క్రితమే సొంతూరుకి వచ్చాడు. కరోనా సోకి ఊపిరాడక పోవడం వల్ల కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇలా జరిగింది.

Last Updated : May 11, 2021, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details