తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్ట్రెచర్ లేక రోగిని చేతులపై ఎత్తుకెళ్లిన కుటుంబ సభ్యులు - జగదీశ్​పుర్​ ఆస్పత్రి వైరల్ వీడియో

కాలికి శస్త్ర చికిత్స.. నడవలేని స్థితి.. కానీ ఆ ఆస్పత్రిలో కనీసం స్ట్రెచర్​ సదుపాయం కూడా లేదు. దీంతో కుటుంబ సభ్యులే.. పేషెంట్​ను ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని అమేఠీలో జరిగింది.

patient did not get stretcher jagdishpur chc
patient did not get stretcher jagdishpur chc

By

Published : Nov 5, 2022, 2:28 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో​ని ఓ ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడం వల్ల ఒక పేషెంట్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి అమేఠీ జిల్లాలోని జగదీశ్​పుర్ హాస్పిటల్​కు వెళ్లాడు. చికిత్స అనంతరం ఔట్​ పేషెంట్​ వార్డు నుంచి బయటకు వస్తుండగా.. పేషెంట్​ ఒక్కసారిగా జారి కిందపడిపోయాడు. కనీసం స్ట్రెచర్​ సదుపాయం కూడా లేకపోవడం వల్ల.. ఆ పేషెంట్​ను కుటుంబ సభ్యుల ఎత్తుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయంకేశ్వర్ శరణ్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. ఆస్పత్రుల పరిస్థితుల గురించి ఉత్తర్​ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రదీప్ తివారీ​ని ప్రశ్నించగా.. స్ట్రెచర్​ కొరత ఆస్పత్రిలో లేదని.. పేషెంట్​లు స్ట్రెచర్​ తీసుకోకుంటే మేము ఏం చేస్తాం అని బదులిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details