ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ రోగికి ఒకేసారి బ్లాక్, వైట్ ఫంగస్‌లు సోకాయి. బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న వారిలో వైట్ ఫంగస్ సోకడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.
ఒకే వ్యక్తిలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్! - uttar pradesh black fungus cases
ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో ఓ రోగికి ఒకేసారి శిలీంధ్రవ్యాధులైన బ్లాక్, వైట్ ఫంగస్‌లు సోకాయి. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.
బిజ్నోర్కు చెందిన బాధితుడు కంటిచూపు సమస్యతో తమను సంప్రదించాడని ఆనంద్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పునీత్ భార్గవ తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన అతనికి పరీక్షలు నిర్వహించగా వైట్ ఫంగస్ కూడా సోకినట్లు నిర్ధరణ అయిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ అతని సైనస్ ద్వారా శరీరంలోకి వ్యాపించిందని.. అయితే తక్షణమే చికిత్స ప్రారంభించిన కారణంగా అతని కంటిచూపుకు ఎలాంటి ముప్పు కలగలేదని స్పష్టం చేశారు. వైట్ ఫంగస్‌ను చికిత్స ద్వారా నివారించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి :'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి'