మహారాష్ట్ర ముంబయిలో షాకింగ్ ఘటన జరిగింది. ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి కంటి సమీపంలో ఎలుక కరిచింది. అయితే.. దీనివల్ల రోగి కంటికి ఎలాంటి అపాయం జరగలేదని రాజ్వాది ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆసుపత్రి డీన్ డాక్టర్ విద్యా థాకూర్ అన్నారు. రోగికి స్వల్ప గాయాలే అయినప్పటికీ వాటిని అశ్రద్ధ చేయలేమని పేర్కొన్నారు.
రోగికి కంటికి శస్త్రచికిత్స జరిగి ఐసీయూలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అతని బంధువు తెలిపారు.
అయితే.. గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఘటన జరిగిందని వైద్యురాలు వెల్లడించారు. కొందరు ఆసుపత్రి సమీపంలో చెత్త పడేస్తారని, అందుకే ఇలాంటి ప్రమాదం తలెత్తిందని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మేయర్ సీరియస్
ఈ ఘటనపై ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి:సినీ ఫక్కీలో బ్యాంకు గోడకు కన్నం- రూ.లక్షల్లో దోపిడి