Patanjali Oil Palm Plantation Assam : ఆయుర్వేద రంగంలో విశేష కృషి చేస్తున్న పతంజలి సంస్థ.. అసోంలోని తీన్సుకియా గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగమైంది. ఆయిల్ పామ్ సాగు విషయంలో ఈశాన్య రాష్ట్ర దశాదిశను మార్చేందుకు అసోం ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 'ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్' పేరుతో 2023 ఆగస్టు 8న ఈ కార్యక్రమం నిర్వహించారు.
గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి 2021 ఆగస్టులో ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్‌పై జాతీయ మిషన్‌ను లాంఛ్ చేశారు. దేశంలో ఆయిల్ పామ్ సాగవుతున్న విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మరిన్ని అవకాశాలు అందేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తూ ఈ మిషన్‌ను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆయిల్ పామ్ మిషన్ విజయవంతమైన నేపథ్యంలో అసోం వ్యవసాయ శాఖ.. 'జాతీయ స్థాయి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్' చేపట్టింది. 2023 జులై 25 నుంచి ఆగస్టు 5వరకు ఈ డ్రైవ్ కొనసాగింది. స్థానిక రైతులకు అవగాహన కల్పించి, ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆయిల్ పామ్ మొక్కల పెంపకంలో గణనీయమైన అనుభవం ఉన్న పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) ఈ మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో పాల్గొంది. దేశవ్యాప్తంగా 64 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ ఈ రంగంలో అగ్రగామిగా పతంజలి నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ సాగు కంపెనీల్లో ఒకటిగా ఉన్న పతంజలి.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ మొక్కల పెంపకం చేపడుతోంది. ఈ ప్లాంటేషన్ డ్రైవ్‌లు ఆరు రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో ఉన్న 14 బ్లాకులలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే విధంగా సెరేమోనియల్ ప్లాంటేషన్‌లో భాగంగా 20 హెక్టార్లలో 3వేల మొక్కలను నాటారు. ప్లాంటేషన్ వేడుకలకు హాజరైన అతిథులు వీటి పంపిణీ చేపట్టారు. 9 రోజుల పాటు జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో 1200కు పైగా హెక్టార్లలో 1.80 లక్షల మొక్కలను నాటారు. ఆరు రాష్ట్రాల్లోని 800 మంది రైతులకు ఈ మొక్కలను పంపిణీ చేశారు.